- Advertisement -
హుజురాబాద్‌లో ఈ నెల 16న సీఎం కేసీఆర్ సభ జరగనున్న సంగతి తెలిసిందే. శాలపల్లి గ్రామంలో దళిత బంధు పథకంపై విదివిధానాలను ప్రకటించనున్నారు.ఈ క్రమంలో సభ ఏర్పాట్లను గురువారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు హరీష్ రావు.
సభకు తరలివచ్చే ప్రజలు, ప్రముఖులు, మీడియా కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇక హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గెల్లు ప్రకటనతో హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
- Advertisement -