కార్యకర్తలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం: హరీశ్ రావు

194
harishrao
- Advertisement -

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అన్నారు మంత్రి హరీశ్‌ రావు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం కొనయిపల్లి గ్రామానికి చెందిన టి ఆర్ ఎస్ కార్యకర్త స్వామి టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా అంత్యక్రియలకు హాజరైన హరీశ్‌ రావు…స్వామి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావు.. ఆత్మవిశ్వాసం తో ముందుకు పోదాం అన్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలి….సహనం కోల్పోవద్దు..ధైర్యం తో ముందుకు పోదాం అన్నారు.టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను,దుఃఖ పడ్డాము…కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోవద్దు..

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరిని కాపాడుకుంటుందన్నారు. మేము అందరం మీకు అండగా ఉంటాము.. అనుకోని సంఘటన జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుతున్నానని చెప్పారు.స్వామి చాలా చురుకైన కార్యకర్త మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం లో చురుకుగా పాల్గొన్నాడు …రాత్రిం భవళ్లు పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్త అన్నారు. తక్షణ సాయంగా వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చామని .. భవిష్యత్తు లో కూడా స్వామి కుటుంబానికి టీ ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

కార్యకర్తలు అందరూ కూడా ధైర్యాన్ని సహనాన్ని కోల్పోవద్దు.. మనో నిబ్బరం తో ఉండండి.. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది..స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్ లో తల్లి కోరుకున్న విధంగా చదివిపిస్తామని చెప్పారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం …. స్వామి కుటుంబానికి పార్టీ పక్షాన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పక్షాన సంతాపం వ్యక్తం తెలియ చేస్తున్నాం అన్నారు.పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు మేము అందరం ఇక్కడికి వచ్చాము.. సహాయం అందించాము.. అండగా ఉంటామని చెప్పారు.

- Advertisement -