తెలంగాణలో నీటి విప్లవం: మంత్రి హరీష్ రావు

184
harishrao
- Advertisement -

ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలో నీటి విప్లవం తీసుకువచ్చామని మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ప్రగతి ధర్మారం చెరువులో 1 లక్ష 76 వేల చేప పిల్లలను వదిలారు. గ్రామంలో సీసీ రోడ్డు, డంప్ యార్డ్, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామంకు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…. కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా గ్రామాలలో ఎండ కాలంలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నాయని చెప్పారు. గతంలో చెరువులు నిండితేనే చేప పిల్లల పెంపకం జరిగేది కానీ నేడు ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపుతున్నాం అన్నారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా 1596 చెరువులలో ఐదు కోట్ల చేపపిల్లలను ఉచితంగా అందజేస్తున్నాం అని… మెదక్ జిల్లాలో 400 చెరువులు నీటితో నిండాయని వాటిలో పూర్తిస్థాయిలో చేప పిల్లలను వేస్తాం అన్నారు. మత్స్యకారులకు ప్రమాద బీమా సౌకర్యం ఆరు లక్షల రూపాయలకు పెంచామని… గతంలో ఇతర రాష్ట్రాల నుండి చేపలను దిగుమతి చేసుకునే వారని కానీ నేడు ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసే విధంగా మత్స్యకారులను అభివృద్ధి చేస్తామని హరీష్ రావు తెలిపారు
.

- Advertisement -