మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి..

43
harish
- Advertisement -

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలన్నదే టీఆర్ఎస్ అభిమతమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణం, రెడ్డి ఫంక్షన్ హల్ లో భారతీయస్టేట్ బ్యాంకు సిద్ధిపేట రీజియన్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు లోన్ మేళా కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.

మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టి ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్ ల ఉద్దేశ్యం అన్నారు హరీష్.జిల్లాలో ఒకే గ్రూపుకు 20 లక్షల లోన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అవ్వడం హార్షనీయం. 10 ఏళ్ల క్రితం ఒక మహిళ సంఘం గ్రూపుకు 50,000 లు ఇవ్వాలంటే బ్యాంకర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. SHG మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టి ఆర్థికంగా ప్రగతి బాట పట్టడం ద్వారా బ్యాంకర్లకు స్వయం సహాయక సంఘాలపై నమ్మకం పెరిగింది. ఫలితంగా బ్యాంకర్లే స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టి బ్యాంకర్లు ఇచ్చే రుణాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టాలని మహిళలకు సూచన. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో తొక్కుల విక్రయాలకు ఈర్కోడ్, పప్పులకు మిట్టపల్లి ప్రసిద్ధి చెందాయి, వాటి నిర్వహణ బాధ్యతలు మహిళలే చూస్తున్నారు. కొంతమంది మహిళలు చేతి బ్యాగులు, మాస్కుల వంటి స్వయం ఉపాధి పథకాలను చేపట్టి రాణిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాల్లో నీటి లభ్యత పెరిగి పాడి పశువుల పెంపకానికి గ్రామాలు అనువుగా మారాయి. పాడి యూనిట్లను స్థాపించడం ద్వారా ఆర్థికంగా ఎదిగే ఆస్కారము మహిళలకు ఉందన్నారు. మహిళలు ఉమ్మడిగా సూపర్ మార్కెట్ వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను కూడా చేపట్టి విజయం సాధించవచ్చు అన్నారు.

తెలంగాణ స్వయం సహాయక సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చే స్థాయికి మన మహిళా సంఘాలు ఎదగడం మనందరికీ గర్వకారణం. బ్యాంకర్ల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో మన స్వయం సహాయక బృందాలు ముందున్నాయి. 99 శాతం రుణాల రికవరీ ఉండడం వల్లే ఈరోజు బ్యాంకర్లు రుణాలను విరివిగా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. సెర్ప్ మెప్మా ఉద్యోగులు సైతం స్వయం సహాయక సంఘాలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వారు స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టేలా చూడాలి. స్వయం సంఘాల పనితీరు మరింత ప్రభావంతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులదే అన్నారు.

- Advertisement -