త్వరలో వైద్యశాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో రూ. 10.91 కోట్లతో నిర్మించనున్న కొత్త ఒపిడి బ్లాక్ కు శంకుస్థాపన చేశారు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. అనంతరం 13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, DME రమేష్ రెడ్డి, IPM డైరెక్టర్, ఫీవర్ హాస్పిటల్ ఇంఛార్జి శంకర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతిమీన తదితరులతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఫీవర్ ఆసుపత్రిలో ఈరోజు రూ. 10.91 కోట్లతో కొత్త ఒపిడి బ్లాక్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీంతో పాటు ఇదే వేదికగా 13 హర్సే వెహికల్స్ (పరమపద వాహనాలు), 3 అంబులెన్స్ లను ప్రారంభించుకున్నాం. దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటగా ఈ హాస్పిటల్ ను విజిట్ చేశారన్నారు.
హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణం 5 కోట్లు విడుదల చేశారు… ఫీవర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉంది. 1915లో క్వారంటైన్ సెంటర్ గా మొదలైంది. కాలక్రమేణా అది కొరంటి ఆసుపత్రిగా పేరుగాంచిందన్నారు. అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుంది… o.p రోజుకు సగటున 500-600, సీజనల్ వ్యాధుల సమయంలో 1000 వరకు వస్తున్నారు. అందుకే కొత్త OPD బ్లాక్ ను నిర్మించుకున్నాం అన్నారు. నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్లను సీఎం కేసీఆర్ కడుతున్నారని… సమైఖ్య రాష్ట్రంలో కొత్త దవాఖాన లు ఇవ్వలేదన్నారు.