సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను వెల్లడించారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటన ఉంటుందని… ఇది పూర్తిగా సిద్దిపేట నియోజకవర్గ స్థాయి పర్యటన మాత్రమేనని వెల్లడించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని చాలా రోజులుగా భావిస్తున్నాము…… మొట్టమొదటి టిఆర్ఎస్ ఆఫీస్ ఇక్కడే ప్రారంభించుకుంటున్నాం అన్నారు. ఉదయం 11 గంటలకు 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటి టవర్ కు శంకుస్థాపన చేశామన్నారు. 2000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం 45 కోట్లతో ఈ ఐటి టవర్ నిర్మించుకుంటున్నాం అన్నారు.
సీఎం సమక్షంలో నే మూడు కంపెనీలతో MOU కుదుర్చుకోబోతున్నాం.….పొన్నాల గ్రామ శివారులోని టిఆర్ఎస్ భవన్ ప్రారంభిస్తారు అని తెలిపారు. అనంతరం మిట్టపల్లిలోని రైతు వేదిక ను సీఎం ప్రారంభిస్తారు. జిల్లాలో 90 శాతం రైతు వేదిక ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. జిల్లాలో 127 రైతు వేదికలు నిర్మిస్తున్నాం.…. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించి, వెయ్యి పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కోమటి చెరువు ను దశల వారీగా అభివృద్ధి చేస్తూ మోడల్ చేరువుగా తీర్చిదిద్దాం.
- నర్సాపూర్ రోడ్ లో 45 ఎకరాల్లో నిర్మించిన 2460 డబుల్ బెడ్రమ్ ఇండ్ల సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు..144 మంది లబ్దిదారులతో సీఎం గృహ ప్రవేశాలు చేయిస్తారు. ఈ కాలనికి కేసిఆర్ నగర్ గా నామకరణం చేస్తున్నాం అన్నారు.1341 మందికి మొదటి దశలో ఇండ్లు కేటాయించాము.
- మరో వెయ్యి మంది పేదలకు త్వరలోనే అందిస్తామం… మరిన్ని డబుల్ బెడ్రమ్ ఇవ్వాలని సీఎం ను కోరి పేదలకు అందిస్తాము.…బిగ్ డేటా ను ఉపయోగించి నిజమైన నిరుపేదలకు ఇండ్లు అందిస్తున్న ఘనత మాది అన్నారు. ప్రజలకు ఎం కావాలో అది చేయడమే మా లక్ష్యం అన్నారు. 278 కోట్లతో 328 కిలోమీటర్ల పైప్ లైన్ తో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను సీఎం ప్రారంభిస్తారు….. రంగనాయకసాగర్ మధ్యలో నిర్మించిన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడతారని చెప్పారు.సిద్దిపేటకు అదనంగా రింగ్ రోడ్డును ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఇది రాజీవ్ రహదారి టూ రాజీవ్ రహదారి గా 168 కోట్లతో మంజూరు చేశారు.. ఈ రింగ్ రోడ్డుకు కేసీఆర్ మార్గ్ గా నామకరణం చేశామన్నారు.