సీఎం కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో రక్త దాన శిబిరాలు నిర్వహించింది టీఆర్ఎస్. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 10 వేల యూనిట్ల రక్తాన్ని సేకించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ అద్భుతమైన కార్యక్రమం అన్నారు.
దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్‌బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్, తెల్లరక్తకణాలు, ఎర్ర రక్తకణాలు కలసిన ద్రవం వంటివన్నీ ఉంటాయి.ఈ రక్తాన్ని కంపోనెంట్ గా వేరు చేసి అవసరమైన వారికి అందిస్తాం. అప్పుడు ఒక్కరి రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుందన్నారు. టీచింగ్ ఆసుపత్రుల నుండి అన్ని అరోగ్య కేంద్రాల్లో మా వైద్య సిబ్బంది రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేస్తున్నారన్నారు.
ఈరోజు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్పగా ఉంది. మనమంతా ఒక్కటే. భారతీయులం. కుల, మత, జాతి బేధాలు లేవు అని మనం చాటుతున్నాము.
ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు, పోరాటాల వల్ల నేడు మనం స్వేచ్ఛా ఊపిరి పీల్చుకున్నాం. వారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. దేశ భక్తిని చాటాలన్నారు.అన్నదానం చేస్తే.. ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారన్నారు.