బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు మంత్రి హరీష్ రావు. నంగునూరు మండలం, నర్మేట గ్రామంలో EGS, CSR నిధులు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు హరీష్. మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం ను కిషన్ రెడ్డి నిలదీయాలన్నారు.
తెలంగాణ కు EGS క్రింద EGS కూలీలకు 3 వేల కోట్ల పనిదినాలను తగ్గించడం పై కేంద్రాన్ని ప్రశ్నించాలని…. కూలీల పై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్ల కు పెంచేలా చూడాలన్నారు. అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి….సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా అని మండిపడ్డారు.
ప్రజల ఆకాంక్షల నుంచి, వారి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెరాస అని తెలిపిన హరీష్… బొంది లో ప్రాణం ఉన్నంత వరకు కేసిఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతాం అన్నారు. పెంచేటో డు బిజెపి వాడైతే…పంచే వారు తెరాస పార్టీ అన్నారు.