చెత్తను నివారించే బాధ్యత మనందరిది- మంత్రి హరీష్

540
harish rao
- Advertisement -

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని 30వ వార్డులో మంత్రి హరీష్ రావు పర్యటించారు.30వ వార్డులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్మడంపై అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. వార్డులో తిరుగుతూ వార్డు ప్రజలతో సమస్యలపై మంత్రి ఆరా తీశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వడం లేదని, దోమల వల్ల ఇబ్బంది పడుతున్నామని కాలని వాసులు మంత్రికి చెప్పారు. చెత్త చెదారం ఓపెన్ ప్లాట్లలో వేయడంతో డంప్ యార్డుల తరహాలో కనిపిస్తున్నాయని, అడుగడుగునా చెత్త కనిపియడంతో మంత్రి అధికారులపై మండిపడ్డారు.

Minister Harish Rao

హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డ్ గా మారింది, ఖాళీ ప్లాట్ కనపడడం పాపంగా మారింది. మన ఇల్లు శుభ్రంగా ఉన్నట్లు మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్ర వాతావరణం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు వస్తాయి. ప్రతి ఇంటికి తడి, పొడి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నాం. ప్రజల సహకారం లేనిది పట్టణం ప్రగతి సాధించదు. సిద్దిపేటకు ఒక్కనాడు నీళ్ళ బాధను చూసి పిల్లను ఇచ్చేవారు కాదు నేడు నీళ్ళ బాధ లేకుండా చేశామన్నారు మంత్రి.

Minister Harish Rao

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇస్తే మోరిలు ఎండిపోయి దోమలు పుట్టవు. పది రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ పూర్తి చేయాలి. కనెక్షన్లు పూర్తి చేసి రోడ్లు వేస్తే 30 ఎండ్లు బాధలు ఉండవు. పట్టణంలో వారంలో రెండు రోజులు పొడి చెత్త సేకరిస్తం, తడి చెత్త ప్రతి రోజూ సేకరిస్తము. చెత్త అనేది దేశానికి పెద్ద సమస్యగా మారింది. ప్రజలు సహకరిస్తే చెత్త దూరం చేయవచ్చు. దేశంలో ప్రతిరోజూ 20 వేల టన్నుల చెత్త సేకరిస్తున్నారు. చెత్త కంట్రోల్ చేసే బాధ్యత మనపైన ఉందని మంత్రి తెలిపారు.

Minister Harish Rao

చెత్త లేకుండా చేసే సిద్దిపేట ను బంగారం తరహాలో చేస్తా. లంచాలు లేకుండా సిద్దిపేట మున్సిపాలిటీ పనిచేస్తుంది.త్వరలోనే 57 ఏండ్ల వారికి పింఛన్లు అందిస్తాము. ఇండ్లు లేని వారికి ఉగాది నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తం. భవిష్యత్ లో తమ సొంత ప్లాట్ లో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం నుండి డబ్బులు ఇస్తం. ప్లాస్టిక్ ను అందరూ నివారించాలి. పుట్టినరోజు, మరణించిన రోజు మొక్కలు నాటాలి. శ్మశాన వాటికలను పార్క్ తరహాలో తయారు చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా కాలని వాసులకు తడిపొడి చెత్త బుట్టలు పంపిణీచేశారు మంత్రి హరీష్‌ రావు.

- Advertisement -