హారితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ నెల 25న నర్సాపూర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న ఆరో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గోన్నారు.
ఈసందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… 6 వ హరితహరం కార్యక్రమం నర్సాపూర్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదు గా ప్రారంభమవుతుందన్నారు. గత పాలకులు అటవీ లను నిర్లక్ష్యం చేయడం వల్ల అటవీ సంపద తరిగిపోయింది.అడవుల పునరుద్ధరణ లో భాగంగా మెదక్ జిల్లాలో 50 హెక్టార్లలో విసిర్ణం లో అడవులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పునరుద్ధరణ 20 వేల హెక్టార్లలో పునరుద్దరణ జరిగింది. ఈ సంవత్సరం 12 వేల హెక్టార్ల విసిర్ణం లో అడవి భూములను పునరుద్ధరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. మొక్కలు నాటడం తో పర్యావరణ పరిరక్షణ రక్షించబడిన వాళ్ళము అవుతామన్నారు.వన్యప్రాణుల కోసం పండ్ల మొక్కలు కూడా నాటనున్నట్లు తెలిపారు.