మంత్రి హరీష్ రావు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ సన్నివేశానికి కోఠి ఈఎన్టీ ఆస్పత్రి వేదికైంది. నిత్యం రాజకీయాలతో బిజీబిజీగా ఉండే మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోఠి ఆస్పత్రిలో సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోఠి ఆసుపత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవల గురించి ఓ పేషేంట్‌ను మంత్రి హరీష్ రావు అడిగారు. అయితే అసుపత్రిలో వైద్యసేవలు అద్భుతంగా వున్నాయని ఆ పేషేంట్ చెప్పింది. అది విన్న బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మొఖంలో నిజమే కదా అనే ఫీలింగ్ నవ్వుతూ వ్యక్తపరిచాడు.
ఈ క్రమంలో రాజ్ సింగ్ జీ జర సునో అంటూ మంత్రి హరీష్ అన్నారు. పేషేంట్ చెప్పిన మాటలు ఎమ్మెల్యే రాజసింగ్ ఆసక్తిగా విన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు అద్భుతం అని మరోసారి రుజువైంది అని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులలో సైతం చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కళ్ళ ముందు నిజము కనిపించడంతో ఆసుపత్రిలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వార్తపై అందరూ చర్చించికుంటున్నారు.
మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో… రాష్ట్రంలోని ప్రభుత్వ దావాఖానాల్లో ఎలాంటి మెరుగైన వసతులు కల్పించి.. సామాన్య ప్రజానీకానికి నాణ్యమైన వైద్యం అందించడానికి ఏవిధంగా కృషి చేస్తుందో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఎవరికైనా ఇట్టే అర్ధమవుతోంది. నిత్యం ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేల్చే ప్రతిపక్షాలు ఇప్పటికైనా తెలంగాణలోని ప్రభుత్వ దావాఖానాల్లో అందుతున్న నాణ్యమైన వైద్యంను చూసి బుద్ధితెచ్చుకోవాలని.. ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న అడ్డగోలు వాదనలను ఇకనైనా ఆపాలని పలువురు హితువుపలుకుతున్నారు.
హరీష్ రావు కోఠి ఆస్పత్రిలో రాజాసింగ్ ను అడ్డంగా బుక్ చేసి… తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై వైద్యం పొందుతున్న మహిళచేత చెప్పించి.. రాజాసింగ్ నోరు మూయించడంతో…. హరీష్ రావా… మజాకా అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. మొత్తానికి హరీష్ రావు రాజాసింగ్ కు ఇచ్చిన షాక్ తో అటు కాంగ్రెస్ నేతలు కానీ.. ఇటు బీజేపీ నేతలు కానీ.. బుద్ధి తెచ్చుకునే విధంగా ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అనే విధంగా హరీష్ రావు మాస్టర్ ప్లాన్ వేశారనే చర్చ జోరుగా సాగుతోంది.