అడవుల పునరుద్ధరణ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

182
harishrao
- Advertisement -

దేశంలో అడవుల పునరుద్ధరణ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో శ్రీకారం చుట్టారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కను నాటి హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, హరీశ్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… నర్సాపూర్ అడవి ప్రాంత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిసారి తనను అడుగుతుంటారని చెప్పారు. మెదక్ జిల్లాలో అడవుల పరిరక్షణ పెద్ద ఎత్తున చేసినట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున హరితహారం కింద మొక్కలు నాటమన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 2లక్షల 60ఎకరాల్లో నియంత్రిత వ్యవసాయం సాగుతుందన్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. 6వ విడత హరితహారం నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. నర్సాపూర్ అడవిని పునరుద్ధరణ చేస్తామని హామి ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన 5విడతల హరితహారం కార్యక్రమంలో 182కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. 6వ విడతలో 30కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పచ్చదనం, పారిశుద్ధ్య కోసం
గ్రామాల్లో ట్రాక్టర్లు అందజేశామన్నారు.

- Advertisement -