దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ: మంత్రి హరీశ్‌

116
minister harish
- Advertisement -

మార్కెట్ వ్యవస్థ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక చాలా బలోపేతం అయిందన్నారు రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డ్‌లో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవ రెడ్డి హాజరైయ్యారు. ఈ మేరకు కొత్తగా నియమితులైన కార్యవర్గ సభ్యులను మంత్రి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మార్కెట్ వ్యవస్థ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక చాలా బలోపేతం అయిందన్నారు. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే హరిశ్‌ కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో అధ్బుతంగా రాణిస్తున్నారు కావున ఈ మార్కెట్ కమిటీ మహిళకు కేటాయించారని తెలిపారు.

సిద్దిపేటలో ఈ మార్కెట్‌ 1 లక్ష 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగింది. గత ప్రభుత్వాలు గోడౌన్‌ల కోసం అలోంచించిన దాఖలాలు లేవని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి మండలంలో 5 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లు నిర్మించామన్నారు. దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని చెప్పారు. ఆంధ్ర కంటే రెట్టింపు వరి పంట తెలంగాణలో పండిందని మంత్రి అన్నారు. పంట పండడం వల్ల ధాన్యం మోయడానికి కూలీలు దొరకని పరిస్థితి తెలంగాణ వచ్చింది, ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -