బుధవారం నాడు మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సిన అవసరం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్నా ఎవరికి ఎలాంటి లాభం జరగలేదు. వలస కార్మికుల ఆకలి తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది స్వచ్ఛంద సంస్థలు మాత్రమే వలస కార్మికులు ఆకలి తెచ్చాయని మంత్రి మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం మాటల గారడీ ప్రభుత్వం. అంకెల గారడీ చూపించి ప్రజలను మోసం చేసింది. కరోనా వైరస్ వల్ల నష్టపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా ఆదుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు బ్యాంకులో వేసింది. కేంద్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకొని కరోనా వైరస్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలి అని పేర్కొన్నారు.