కాగ్ ( కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) నివేదికకు కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదికను తప్పులతడక అన్న కాంగ్రెస్…ఇప్పుడు బ్రహ్మపదార్ధంలా మాట్లాడుతుందని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. అంతేకాకుండా… కాంగ్రెస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు… కాగ్ నివేదికపై కాంగ్రెస్ స్పందిస్తున్న తీరును తప్పుబట్టారు. కాగ్ నివేదికను అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి బైబులా, ఖురానా అని సంభోదించాడని, కాంగ్రెస్ నేతలు అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా.. రెండునాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.
కాగా…గుజరాత్ లో మోదీ 9ఏళ్ళ పాలన పై కాగ్ నివేదిక ఇచ్చిందని, మోదీ ప్రభుత్వంలో అవినీతిని ఎత్తి చూపించిందని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశంసలు..బీజేపీయేతర రాష్ట్రాల్లో విమర్శలా.. అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు.