అన్ని వర్గాలు సురభి వాణీ దేవి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణి దేవి గెలుపు కోరుతూ రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ.. పోయిన ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పరిగి, తాండూరు, మహబూబ్ నగర్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ ను కలవలేదని అక్కడి వారు చెబుతున్నారు. రాంచందర్ రావు పట్టభద్రులను చిన్న చూపు చూశారు. 2018లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా పోటీ చేశారు. అంటే గెలిస్తే మధ్యలో ఈ పదవి వదిలి వెళ్లిపోయేవాడు కదా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ప దవి అంటేనే రాంచందర్ రావుకు చిన్న చూపు. పట్టబద్రులకు సేవ చేయాలని అనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఎందుకు పోటీ చేసినట్లు. ఇప్పుడు ఓటు వేసి గెలిపిస్తే..మళ్లీ మధ్యలో వదిలి వెళ్లిపోవన్న గ్యారంటీ ఏంటి అని మంత్రి హరీష్ ప్రశ్నించారు.
సురభి వాణి మాజీ ప్రధాని కూమార్తెగా, సంప్రదాయ కుటుంబం నుంచి వ్యక్తి, విద్యావేత్త. విద్యారంగంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి. లెక్చరర్ గా, ఫ్రోఫెసర్ గా, కరస్పాండెంట్ గా లక్ష మంది పట్టభద్రులను ఆమే సమాజానికి అందించారు. ఆమెను గెలిపించాలి. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి.? అసలు బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పమనండి. ఏ ప్రాతిపదికన బీజేపీ ఓటు అడుగుతోంది. పెట్రోల్, డిజీల్ థరలు పెంచినందుకు ఓటు వేయమని అడుగుతున్నారా..? సంవత్సరానికి 225 రూపాయలు గ్యాస్ ధర పెంచినందుకు ఓటు వేయాలా..? విభజన హామీ చట్టంలో పేర్కొన్న ఒక్క హమీ నెరవేర్చనందుకు బీజేపీకి ఓటు వేయాలా..? హక్కుగా రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రానందుకు బీజేపీకి ఓటు వేయాలా..? గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా….? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు, ఐటీ ఐఆర్ రద్దు చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినందుకు బీజేపీకి ఓటు వేయాలా.. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు రిజర్వేషన్లు ఊడగొడుతునందుకు బీజేపీకి ఓటు వేయాలా…? ప్రపంచంలో పెద్దదైన ఎల్. ఐ. సీ, రైల్వైలు ప్రయివేటు పరం చేస్తునందుకు బీజేపీకి ఓటు వేయాలా…? బీఎస్ఎన్ ఎల్ లో 50 శాతం ఉద్యోగాలు ఊడగొట్టి ప్రయివేటు పరం చేస్తునందుకు బీజేపీకి ఓటు వేయాలా..? అని మంత్రి మండిపడ్డారు.
ప్రభుత్వ రంగం స్థంస్థ ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్నా… ఇప్పటికే బీపీసీల్ , విశాఖ ఉక్కు, ఎల్. ఐ. సీని అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాని పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల్లారా ఈ బీజేపీని మట్టికరిపిస్తేనే.. ఈ సంస్థలను కాపాడుకోవచ్చు. వాణీ దేవిని గెలిపించిండి… పార్లమెంట్‌లో ప్రయివేటు రంగ సంస్థల అమ్మకాన్ని అడ్డుకునేలా పోరాడుతాం. మీకు అండగా ఉంటామన్నారు. ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముతున్నారు.. బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని రేపు అమ్ముతారు. మీ ఉద్యోగాలకు భద్రత ఉండదు. రిజర్వేషన్లు ఉండవు. దళిత, గిరిజనుల హక్కులు ఉండవు. రేపు ప్రయివేటు రంగ సంస్థలు ప్రయివేటు పరం అయితే రిజర్వేషన్లు దక్కుతాయా.. అని ప్రశ్నించారు. తెరాస అభివృద్ధి, సంక్షేమం, మంచి అభ్యర్థిని చూసి ఓటు వేయండి. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బీజేపీ, లక్షా 34 వేల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెరాస, మరో 25 వేల ఉద్యోగాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. మరో 50 వేల ఉద్యోగాలకు సన్నాహాలు చేస్తోంది. ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరు. ఏడాదికి రెండు కోట్లు, ఆరేళ్లలో 12 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు.
రాష్ట్రానిక బడ్జెట్లో మొండి చేయి. 3 వేల కోట్ల రూపాయలు గత ఏడాది కన్న ఈ ఏడాది డెవెల్యూషన్ నిధులు తగ్గించారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్నయని లక్ష కోట్ల ప్యాకేజి ఇచ్చారు. జాతీయ రహదారులు, మెట్రో రైలు ఎక్సెటెన్షన్, కర్ణాటక మెట్రో రైల్ ఎక్సెటెన్షన్, గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. తెలంగాణకు బడ్జెట్ లో కోతలు..ప్రజలకు పెట్రో, డిజిల్, గ్యాస్ ధరలు పెంచి వాతలు పెట్టారు.బీజేపీ చేసిన మంచి పనులు ఎంటి. ? ఇందు కోసం మీకు ఓటు వేయాలా…? రెండు లక్షల ఓట్లు మా పార్టీ కుటుంబ సభ్యులవే. మా అభ్యర్థి మహిళ. మహిళలంతా వాణీ దేవి వైపు చూస్తున్నారు. లక్షా 95 మహిళా ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ మాకు కలిసి వచ్చే అంశాలు అన్నారు మంత్రి. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పని తీరుపై ప్రజల్లో అయిష్టత ఉంది. కాంగ్రెస్ విషయానిక వస్తే… గళ్లీలో లేదు…ఢిల్లీలో లేదు.వాళ్లు వాళ్లు కొట్లాడుకోవడం తప్ప ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి లేదు. మా అభ్యర్థి వాణీ దేవి గెలుపు ఖాయం అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.

