ప్రతి ఇంటికి రేషన్ సరుకులు అందిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రి హరీష్ రావు కరోనా వైరస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..షట్ డౌన్ తో ఇతర రోగులకు ఇబ్బంది కలుగకూడదు. జిల్లా కేంద్ర ఆస్పత్రి లో రోగులకు రెండు పూటలా భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. మాస్కుల సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రవేటు ఆస్పత్రులు మూయకుండా చూడాలన్నారు. రేపటిలోగా మాస్కులు, కిట్ లు పంపిచేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఎండీ కి ఫోన్ లో ఆదేశాలు ఇచ్చారు. రేషన్ దుకాణాల్లో పంపిణీకి సరైన చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రతి షాప్ దగ్గర మూడు మీటర్లకో డబ్బా గీసి ఉంచాలి. తండాలు, ఆమ్లెట్ గ్రామాల్లోనీ ప్రజల సౌకర్యార్తం అక్కడే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.