బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌..

18

హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ప్రభుత్వ యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసితో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, పాషా ఖాద్రీ బూస్టర్ డోసును వేసుకున్నారు.

అనంతరం మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు వాక్సిన్ వేస్తూ.. బూస్టర్ డోసు ప్రారంబించడం సంతోషంగా ఉంది. అందరూ తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలి అని సందేశాన్ని ప్రజలందరికీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన అన్ని దేశాలు బూస్టర్ డోసు వేసుకుంటున్నాయి. మనం అదే దారిలో నడవాలి. అర్హులైన వారు బూస్టర్ తీసుకోవాలి. అందరికి ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందీ. స్థానిక ఎమ్మెల్యే లు మాకు మొదటి డోస్ సమయంలో చాలా సహకారం అందించారు. బూస్టర్ డోస్ , 15 ఏళ్ళు పై బడిన వారికి టీకా విషయంలోను ప్రజా ప్రతినిధులు సహకరించాలి అన్నారు.

టీకా విషయంలో ఎలాంటి సంశయాలు అక్కర్లేదు. మొదటి డోస్ 102% పూర్తి అయింది. కేవలం వారం రోజలో 15 నుంచి 18 ఎల్లా మధ్య వారిలో 38 % మందికి మొదటి డోస్ టీకా పూర్తి అయింది. టికా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో వేగంగా టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే యునానీ ఆస్పత్రిలో సమస్యలపై ఇప్పుడే చర్చించాము. పక్షవాతం వంటి వాటికి చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం యునానీ ఆస్పత్రికి రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాము. అవసరం అయిన నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యం. ఏదో జరుగుతుంది అనే అపోహ వద్దు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలి. కరోనా సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం మరువద్దు. అందరం కలిసి కరోనా నీ ఎదుర్కొందాం. కరోనాపై చేస్తున్న పోరులో ప్రభుత్వానికి అందరూ సహకరించాలి అని సూచించారు.