నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్ రూం ఇండ్లు అన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నిరుపేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం లేదు. పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇన్నాళ్లూ గుడిసెల్లో నివసించిన బద్ధిపడగ తండా లంబాడీలు ఇప్పుడు ఆత్మ గౌరవం తో జీవిస్తారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇండ్లు నిర్మించి ఇస్తాం.. మిగిలి పోయిన పేదవారికి కూడా మరిన్ని ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
పేద ప్రజలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభదాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పెన్షన్లు పెంచారు. యువత సోషల్ మీడియా మోజులో పడి జీవితాల్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. పనిచేయడానికి ముందుకు వచ్చే యువకులకు శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.