రైతుగా మారి విత్తనాలు చల్లిన మంత్రి హరీష్‌..

221
harish
- Advertisement -

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం, ముద్దాపూర్ గ్రామంలో మంత్రి హరీష్‌ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు వెదజల్లే పధ్ధతిలో వరిసాగుపై అవగాహన కల్సించారు. ఇందులో భాగంగా గ్రామ శివారులోని యాట నర్సింలు రైతు పొలంలో మంత్రి హరీష్‌ స్వయంగా పొలంలో వెదజల్లే పధ్ధతిలో వరిసాగుకు విత్తనాలు జల్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వెదజల్లే పద్దతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి వరి పంటను సులభంగా నాటుకోవచ్చు అని అన్నారు.

నారు పోసే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. కానీ ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిదని మంత్రి సూచించారు. సిద్దిపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.వెదజల్లే పద్దతిలో వరి సాగు చేసే అంశంపై సిద్దిపేట జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

- Advertisement -