గురువారం ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కుటుంబ రాజకీయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని హరీశ్ రావు దుయ్యబట్టారు. మోదీ వ్యాఖ్యలపై స్పందిచిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తెలంగాణపై బుదర జల్లే మాటలు తప్ప ప్రజలకు పనికోచ్చే ఓమాటకు మాట్లాడలేదని అన్నారు.మోదీ ప్రసంగం బీజేపీ కార్యకర్తలకు నచ్చుతుంది కావొచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గురివింద గింజ తన నలుపు చూసుకోవాలి అని హీతువు పలికారు.
కుటుంబ పాలన గురించి మోదీ మాట్లాడుతున్నాడు.. మరి మీ పార్టీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ కుమారుడు బీజేపీలో లేడా?. యూపీలో పొత్తు పెట్టుకున్న అప్నాదళ్ కుటుంబ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. మీ తప్పులు ఎత్తి చూపితే కుటుంబ పార్టీ అంటారు. గతంలో పంజాబ్‌లో అకాళీదళ్‌తో అధికారం పంచుకోలేదా?.. మోదీ ఒక వేలు ఎత్తి చూపితే.. నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం.. రాష్ట్రాన్ని కుటుంబంగా భావిస్తే పరిపాలించే నాయకుడు కేసీఆర్. అధికారం లాక్కుంటే రాలేదు. ప్రజలే అధికారం ఇచ్చారు అని హరీష్ రావు తెలిపారు.