ఈ వాహనాలతో మీ అప్పులు తీర్చు కొవాలి..

249
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ స్వ గ్రామం చింతమడకలో అర్హులైన లబ్దిదారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం వివిధ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ వ్యక్తి గత అభివృద్ధి ఫలాలు చింతమడక, మాచాపూర్ ,సీతారాం పల్లి, గ్రామాల లబ్ధిదారులకు పంపిణీ చేయడం నా అదృష్టం.నా కళ్ళలో వెయ్యి వోల్టేజిల కాంతి నింపిందన్నారు.

సీఎం కేసీఆర్ గ్రామ ప్రజల ఆర్థిక అభివృద్ధికి వాహనాలు,గేదెలు,కోళ్ల ఫామ్, హార్వెస్టార్,జేసిబి, మినీ గూడ్స్ వెహికిల్ ఇతర వాహనాలు పంపిణి చేశారు. నాటి డ్రైవర్లు నేడు ఓనర్లుగా మారిపోయారు. వాహనాలను భద్రంగా చూసుకోవాలి అలాగే మీరు భద్రంగా ఉండాలి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఈ వాహనాలతో మీ అప్పులు తీర్చు కొవాలి. కొన్ని రోజుల్లో మేరే ఇతరులకు అప్పులు ఇచ్చే వారు అవ్వాలని హరీష్‌ అన్నారు.

అప్పుడే మన సీఎం కేసీఆర్‌కు గిప్ట్ ఇచ్చిన వారిమి అవుతాం.మనకు అప్పగించిన వాటిని నమ్మకంతో ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి.త్వరలో చింత మడకలో పాల శీతలీకరణ ఏర్పాటు చేస్తాం.గ్రామంలో 2 కోట్ల 50 లక్షల శివాలయం నిర్మిస్తాం.అందివచ్చిన అవకాశాన్ని అందరూ అంది పుచ్చు కొని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.అర్హులైన వారికి అందరికి ఫలాలు అందుతాయి. ఎవ్వరు కూడా అధైర్య పడవద్దు. మీరు కోరుకున్న రంగంలో మికు అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

- Advertisement -