టీఆర్‌ఎస్‌ పేదల ప్రభుత్వం మంత్రి హరీశ్‌ రావు

119
harishrao
- Advertisement -

పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తుందని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై మోయలేని భారం మోపుతుందన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్‌ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే పింఛన్‌ ఇస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు అదిస్తున్నామని చెప్పారు. ఎవరూలేని వారికి పింఛను, బియ్యం ఇవ్వడం లాంటివి కూడా ఉచితాలుగా చేప్పుకుంటున్నాయని మండిపడ్డారు. ఇలాంటి పథకాలు ఆయా కుటుంబాలకు అందించడం వల్ల తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని వెల్లడించారు.

తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పింఛన్లు ఇచ్చి సీఎం కేసీఆర్‌ అండగా ఉంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారని వెల్లడించారు. సొంత జాగాలో ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగ కానుకగా ప్రారంభిస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇప్పటి వరకూ 50వేల పోస్టుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేశామన్నారు. కాగా కొత్తగా మరో వారం రోజుల్లో 28వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంబిస్తామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున్న ఏ రాష్ట్రంలో… ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేదని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

 

- Advertisement -