హుజూరాబాద్‌ ఫలితంపై మంత్రి హరీష్‌ స్పందన..

60
- Advertisement -

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తామన్నారు మంత్రి హరీష్‌ రావు. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరునా కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ ప్రతీ ఒక్కరికీ ధన్య‌వాదాలు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు, గెలిచిన‌నాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచినా.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందని హరీష్‌ అన్నారు.

దేశంలో ఎక్క‌డ‌లేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ క‌లిసి ప‌నిచేశాయని ఆరోపించారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కూడా చెప్తున్నారని, జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయిలో కుమ్మ‌క్కు కావ‌డాన్ని రాష్ట్ర ప్ర‌జలంతా గ‌మ‌నిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.

- Advertisement -