ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు రుణం ఇప్పించిన మంత్రి హరీశ్..

139
harish
- Advertisement -

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆటో క్రెడిట్ కో ఆపరేటీవ్ సొసైటీ ఏర్పాటు కోసం తన సొంత స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా 45 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పించారు. ఈ సందర్భంగా ఆయనను ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున అభినందించారు. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోనే ఆటో క్రెడిట్ కో ఆపరేటీవ్ సొసైటీ కోసం సభ్యులు తమ వాటా ధనంగా ఒక్కొక్కరు రూ. 1,110 చొప్పున మొత్తం రూ. 8.55 లక్షలు జమచేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల నిమిత్తం కొంత మొత్తం ఖర్చయింది. మిగిలిన సొమ్ము మూలధనంగా సరిపోదని అధికారులు చెప్పడంతో డ్రైవర్లు అందరూ కలిసి మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు వినిపించారు. స్పందించిన హరీశ్ రావు ప్రభుత్వం నుంచి సంఘానికి డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్‌లో ఆటో క్రెడిట్ కో ఆపరేటీవ్ సొసైటీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ కార్యక్రమానకి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ముఖ్య అతిగా హాజరైమ్యారు. ఈ సందర్భంగా హరీశ్ ‌రావు మాట్లాడుతూ.. మూలధనాన్ని సమకూర్చుకోలేని పరిస్థితి తెలిసి తనకు తోచిన సాయం చేశానని, తన సాయంతో ఆటోకార్మికులు నిలదొక్కుకుంటే చాలని అన్నారు.

ఈ సభలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం.. జెడ్పీ చైర్మెన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,డీసీసీబీ ఛైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆర్‌టీఓ రామేశ్వర్ రెడ్డి మరియు సుడా ఛైర్మెన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -