కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి..

46
gangula

కొండా లక్ష్మణ్ భాపూజీ తెలంగాణ ఘనమైన ఉద్యమ వారసత్వానికి ప్రతీక అని ఆ మహనీయుని వర్దంతిని తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈ రోజు ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కొండా లక్షణ్ బాపూజీ సేవల్ని స్మరించుకొన్నారు. సమాజం బాపూజీ అని గౌరవంతో పిలుచుకొనే మహోన్నత వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ అని, కొమరంభీం జిల్లా వాంకిడిలో సాధారణ వెనుకబడిన కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారన్నారు, నిజాముకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసారన్నారు గంగుల, క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు నాటి తొలిదశ తెలంగాణ విముక్తి ఉద్యమంలో వలసపాలనపై తీవ్ర నిరశన తెలియజేసి 1969లో తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.

అనంతరం మలిదశ ఉద్యమంలోనూ నాటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ గారికి అండగా తన ఇళ్లు జలద్రుశ్యాన్ని ఉద్యమ వేదికగా మలిచి స్పూర్తిని అందించారన్నారు. దీన్ని తట్టుకోలేక 2002లో నాటి వలస ప్రభుత్వం జలద్రుశ్యాన్ని నెలమట్టం చేస్తే న్యాయపోరాటం చేసి విజయం సాధించారన్నారు. 21 సెప్టెంబర్ 2012లో పరమపదించే వరకూ కొండా లక్ష్మణ్ బాపూజీ వెనుకబడిన వర్గాల సమున్నతి కోసం తన జీవన ప్ర్రాంతం కృషిచేసి విశేషమైన తన సేవానిరతి ద్వారా నిరంతరం తెలంగాణ సమాజానికి స్పూర్తి నిస్తూనే ఉంటారన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోని ప్రభుత్వం ఆ మహనీయున్ని ఘనంగా స్మరించుకుందని, కొండా లక్ష్మణ్ బాపూజీ హర్టీకల్చర్ యూనివర్శిటీని ఆయన పేర ఏర్పాటుచేసుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న, బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణ క్రుష్ణమోహన్ రావు, బిసి సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బిసిల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.ఈ కార్యక్రమంలోబిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, ఉపేంద్ర, బిసి సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, బిసి కార్పోరేషన్ ఎండి అలోక్ కుమార్, బిసి సంక్షేమశాఖ జేడి చంద్రశేఖర్ ఇతర బిసి సంక్షేమ శాఖ అధికారులు, బిసి ప్రతినిధులు పాల్గొన్నారు.