వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: ఈటల

35
etela

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దన్నారు మంత్రి ఈటల రాజేందర్. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా హుజూరాబాద్‌లోని ప్రాంతీయ దవాఖానలో కొవిషీల్డ్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల…రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని చెప్పారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడివారితోపాటు దీర్ఘకాలి వ్యాధిగ్రస్థులకు టీకాలు వేయనున్నారు. రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనావేస్తున్నారు.