ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌తో కరోనా చికిత్స: ఈటల

324
etela
- Advertisement -

ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వీరందరికీ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి స్వయంగా మాట్లాడారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ నూతన మార్గనిర్దేశకాల ప్రకారం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను పది రోజుల పాటు చికిత్స అందించిన తరువాత ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపింది.

ఒక వేల లక్షణాలు ఎక్కువ ఉన్న, ఇతర ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాదపడుతున్న పేషంట్లను మాత్రం హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిచాలని నిర్దేశించినట్లు తెలిపారు. హోమ్ ఐసోలేషన్ కొరకు మే 10 వ తేదీన విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్శరీ కాంటాక్ట్స్ ను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ICMR మార్గ నిర్ధేశాలు విడుదల చేసింది. ఇంట్లో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారికి సహాయం కోసం ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలా సహాయం అందిస్తున్న వ్యక్తి కి HCQ టాబ్లెట్స్ అందించాలని సూచించింది.

17 రోజుల పాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని ICMR తెలిపింది. ఇలా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని ఉదయం సాయంత్రం మెడికల్ టీం లు పరీక్షలు చేస్తారని, వారికి అవసరం అయిన నిత్యావసరవస్తువులు అన్నీ GHMC ద్వారా అందిస్తామని మంత్రి తెలియజేశారు. సమన్వయం కోసం ప్రత్యేక నోడేల్ ఆఫీసర్ కూడా నియమించామన్నారు.

కోవిడ్ మరణాల విషయంలో కూడా ICMR నూతన మార్గానిర్దేశకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కాన్సర్, గుండెజబ్బులు, లేదా ఇతర జబ్బులతో చనిపోయిన వారికి కరోనా పాజిటివ్ ఉన్న కూడా దీర్ఘ కాలిక వ్యాదులతో చనిపోయినట్టుగానే పరిగణించాలని కొత్త నిభందనలు చెప్తున్నాయి. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుంది. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ICMR తెలిపింది.అయితే పాజిటివ్ కేసులు, మరణాలు దాస్తే దాగవు అని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

- Advertisement -