ప్రతి ఒక్కరు స్వచ్ఛత పాటించాలి- మంత్రి ఈటెల

328
etela rajendar
- Advertisement -

పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో “స్వచ్ఛత నుండి స్వస్థత వరకు దిశానిర్దేశం సభ – పంచ సూత్రాలు” అమలుపై అవగాహన సదస్సును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పి చైర్ పర్సన్ పుట్ట మధు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా కలెక్టర్ దేవసేన మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. కనపడని ఆత్మ స్వచ్ఛతగా ఉండాలి.. కనపడని స్వచ్ఛత వైపు సమాజం అడుగులు వేసే సమయం ఆసన్నమైంది. రాజకీయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రణాళికలు ఏ రాష్ట్రంలో అమలవుతాయో.. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి. సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలతో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారో…అందుకు పెద్దపల్లి జిల్లా ఉదాహరణ అన్నారు.

భారతీయ జీవన విధానం స్వచ్ఛతతో ఇమిడి ఉంది. పాశ్చాత్య సంస్కృతిలో పడి స్వచ్ఛతను మరచిపోయాం. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబలు స్వచ్ఛత పాటించక పోతే అభివృద్ధి సాధ్యం కాదు. ఇంటికి చుట్టం వస్తే మోతుక ఆకుల్లో అన్నం పెట్టే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు సీజన్ పండ్లు,సేంద్రియ పంటలు తిన్నపుడు ఎలాంటి రోగాలు లేవు. ఇప్పటి ఆహారంతో అంతు చిక్కని రోగాలు వస్తున్నాయి. వైద్యం ఖర్చు లు అంచనా వేయలేని పరిస్థితి ఉందన్నారు. డెంగ్యూ జ్వరాలతో తల్లడిల్లిన పెద్దపల్లి ఇప్పుడు స్వచ్ఛతతో రోగాలు రాకుండా తీర్చిదిద్దారు. ప్రేమతో కూడిన పల్లెలను నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని మంత్రి అన్నారు.

minister etela

కాగా మంత్రి ఈటెల దిశ సంఘటనపై స్పంధిస్తూ.. నింధితులను ఉరి తీయాలి. కానీ ఉరి తీయడాం శాశ్వత పరిష్కారం కాదు. స్త్రీ ఆక్రోశిస్తుంది అది ఈ దేశానికి, రాష్ట్రానికి అరిష్టం. ఇంట్లో తాత, నాన్నమ్మ ఉన్నపుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. వారు ఎలా ఉండలో పిల్లలకు నేర్పారు. ప్రస్తుతం వృద్ధాశ్రమల్లో ముసలి వాళ్ళను వేసే దౌర్భాగ్యం వచ్చింది. ఇక సెల్ ఫోన్, టీవీలు ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోవాలి. తల్లిదండ్రులు మీ కొడుకు ఏం పని చేస్తున్నాడో మీకు అవగాహన ఉండాలి. తల్లిదండ్రులు ఒకే కొడుకు,బిడ్డ అని గారాభం చేసుకోవడం కాదు. వారికి సామాజికి స్పృహ కల్పించాలి అని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా స్వచ్ఛతలో అభివృద్ధి చెందడం,అవార్డులు అందుకోవడం జిల్లా స్థాయిని దేశ స్థాయికి పెంచింది. 2014లో తెలంగాణ రాకముందు పరిస్థితులు, తెలంగాణ వచ్చిన 6 సం.ల తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టణాలు,గ్రామాలు 30 రోజులలో అభివృద్ధికి జిల్లా అధికారులు ఎంతో కృషి చేశారు. స్వచ్ఛత నుండి స్వస్థత వరకు జిల్లా అధికారులు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. 6 వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయితీ కరెంట్ బిల్లు చెల్లింపు చేసి సర్పంచులకు ఇబ్బంది లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రానున్న 4 సం.రాలలో ప్రజాప్రతినిధులు,అధికారులతో సమన్వయంతో గ్రామాలు మరింత అభివృద్ధి దిశగా అడుగులు వెయ్యాలన్నారు మంత్రి కొప్పుల.

- Advertisement -