అన్ని ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు: మంత్రి ఈటల

163
etela

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. కరోనాకు సంబంధించి శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఈటల…క‌రోనాపై పోరులో ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల కృషికి మ‌నం ఎంత ఇచ్చినా త‌క్కువే అవుతుంద‌ని తెలిపారు.

కరోనా లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. క‌రోనా తీవ్ర‌త పెరిగితే బాధితుల‌ను ర‌క్షించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని …లంగ్ ఇన్‌ఫెక్ష‌న్ సీటీ స్కాన్‌లో మాత్ర‌మే తెలుస్తుంద‌ని వెల్ల‌డించారు. అన్ని ద‌వాఖాన‌ల్లో ఈ ప‌రీక్ష‌ల‌కు వ‌స‌తులు క‌ల్పిస్తామ‌ని తెలిపారు. క‌రోనా చికిత్స‌ల‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు.