వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి: ఈటల

156
covid
- Advertisement -

రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి తొలి విడత కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇప్పటివరకు 3.60 లక్షల డోసులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపిన ఈటల….కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు పంపిణీ చేసేందుకు 139 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి డోసు తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారని తెలిపారు.

వ్యాక్సిన్‌ భద్రత కోసం 800 కోల్డ్ చైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి వ్యాక్సిన్‌ను జిల్లా కేంద్రాల్లోని ఇమ్యూనేషన్ కేంద్రాలకు తరలించారు. వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు 13వేల 900 మంది హెల్త్‌వర్కర్లకు వ్యాక్సిన్‌ వేస్తారు.

- Advertisement -