రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలపై ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు రాష్ట్రంలో టెస్ట్ లు సరిగా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. బాధ్యత ఉన్నవారు ఇలాంటి ఆరోపణలు చేయరు. ఇవి వారి స్వప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని మంత్రి ఈటెల అన్నారు. పార్టీ అధినేతగా, సీఎంగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రధానిని విమర్శిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తే ఖండించారు. ఈ విపత్తు రాజకీయాలకు, కులాలకు సంబంధించింది కాదు అని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారు. అనేక రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కరోనాను సంబంధించి డబ్ల్యూ హెచ్ ఓ ఇచ్చిన గైడ్ లైన్స్, ఐ సీఎంఆర్ నిబంధనలకు ప్రకారమే టెస్ట్ లు చేస్తున్నాము.
పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు లక్షణాలు ఉన్నవారికి చేయాలి లేదా విషమ పరిస్థితుల్లో ఉన్న రోగి ఇంటి పరిసరాల్లో టెస్ట్ లు చేయాలి. పాజిటివ్ వచ్చిన లక్షణాలు లేకపోతే…ఇంట్లోనే ఉంచి పరిశీలిన చేయవచ్చని ఐ సీఎంఆర్ తెలిపింది. ప్రతిపక్షాలు బాధ్యత, అవగాహన లేకుండా మాట్లాడొద్దు. కరోనా విషయంలో ఉదాసీనంగా ఉండవద్దు అన్ని సీఎం కేసీఆర్ మొదట్లోనే చెప్పారు. ఢిల్లీలో మర్కజ్ సదస్సు కి అనుమతి ఇచ్చింది కేంద్రం. అయినప్పటికీ రాష్ట్రనికి మర్కజ్ నుంచి వచ్చిన ప్రతిఒక్కరికి పరీక్షలు చేసాము.
రాష్ట్రంలో 90% మర్కజ్ కాంటాక్ట్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.పహాడిశరీఫ్ లోనే నిన్న 22 కేసులు నమోదు అయ్యాయి.1044 కేసుల్లో దాదాపుగా అన్ని ట్రెస్ అయ్యాయి.1044 మందిలో 47% క్యూర్ అయ్యారు. 20వేల మందికి ఆక్సిజన్ పెట్టి వైద్యం చేయగల సత్తా తెలంగాణ కు ఉంది. దాదాపుగా లక్ష మందికి ఐసోలేషన్లో వైద్య సేవలు అందించగలిగే సత్తా ఉంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై కేంద్ర బృందం కితాబు ఇచ్చింది. దాన్ని కూడా బీజేపీ అడ్డుపడేందుకు సిద్ధం అవుతోంది. కేంద్ర బృందం సభ్యులను కలిసి నిజమేనా అంటూ ప్రశ్నిస్తూన్నారు. తెలంగాణలో ఇటువంటివి చెల్లవు..మరణాలు దాస్తే దాగేవి కాదు.. జీహెచ్ఎంపీ పరిధిలో కంటైన్మెంట్లను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని మంత్రి ఈటెల తెలిపారు.