వ్యాక్సిన్ డోసులు మరిన్ని ఇవ్వాలి.. కేంద్రాన్ని కోరిన మంత్రి ఈటల..

64
minister etela

తెలంగాణ రాష్ట్రంలో 140 సెంటర్స్ ఏర్పాటు చేశామని. 90 శాతం టార్గెట్ చేరుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలపారు. శనివారం జరిగిన అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి ఈటెల పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రీజ్వి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డా గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. అన్ని సెంటర్స్ లో సాప్ట్ వేర్ పనిచేయడం లేదు. సాఫ్ట్‌వేర్‌లో చాలా సమస్యలు ఉన్నాయని.. ఇంకా సరళతరం చేయండి అని కేంద్ర మంత్రికి తెలిపారు. అలాగే వ్యాక్సిన్ డోసులు మరిన్ని ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కరోనా వారియర్స్ కి వాక్సిన్ అందిస్తున్నాము. ముందుగా హెల్త్ వర్కెర్స్ కి ఇవ్వాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. చాలా మంది మీరు వాక్సిన్ వేసుకొరా అని నన్ను ప్రశ్నించారు. నా వంతు అంటే 50 సంవత్సరాల పైబడిన వారికి వాక్సిన్ వేసేటప్పుడు వేసుకుంటాను అని చెప్పాను. ఈ వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి మీ అందరి సహకారం అవసరం. దేశమంతా సమిష్టిగా పనిచేసి పోలియోను పారద్రోలాము. అలాగే కరోనాను కూడా లేకుండా చేద్దాం అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరారు.