- Advertisement -
రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1044కి చేరింది. ఇవాళ ఒక్క మరణం కూడా సంభవించలేదని మంత్రి ఈటల వెల్లడించారు. నేడు 22 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 464కి పెరిగింది. ఇక 552 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 28 మంది మరణించారు.
లాక్‌డౌన్‌ను తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడం వల్లే లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు సహకరించారని మంత్రి ఈటల పేర్కొన్నారు.
- Advertisement -