కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా పూర్తిగా అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన శనివారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినటువంటి అందరికీ ప్రయివేటు హాస్పిటల్ సిబ్బందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు.
ఫ్రంట్ లైన్‌లో పని చేసినటువంటి పోలీసులకు, పంచాయితీ రాజ్ శాఖ వాళ్ళకి, మునిసిపల్ శాఖ వాళ్ళకి అందరికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. ప్రస్తుతం 45సంవత్సారాలుపై బడిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగతుంది. గ్రామాల్లో కూడా పీహెచ్‌సీ స్థాయిలో ఎక్కువ టెస్టులు చేస్తున్నాం.ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని.. తప్పకుండా మాస్క్ లు ధరించాలి. అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.