కరోనా కట్టడిలో తెలంగాణ భేష్‌ : ఈటల

157
etela
- Advertisement -

కరోనా కట్టడిలో తెలంగాణ భేష్ అన్నారు మంత్రి ఈటల రాజేందర్. గతేడాది దుబాయ్ నుండి తొలి కేసు వచ్చింది ఈ రోజేనని తెలిపిన ఈటల…కరోనా,లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వహించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ లో అని రకాల సిబ్బంది ఆత్మ విశ్వాసంతో పని చేశారని ..35 వేలకు పైగా కోవిడ్ పేషెంట్స్ గాంధీలో చికిత్స పొందారని వెల్లడించారు ఈటల. ప్రాణాలకు తెగించి కర్తవ్యం నిర్వహించారని కొనియాడారు.

కరోనా కట్టడికి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని..విమానాలు, రైళ్లను అపమని మొదటగా చెప్పింది మన ముఖ్యమంత్రి కేసీఆరే అని గుర్తు చేశారు. మొదటగా లాక్ డౌన్ చేసి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని….అనేక రాష్ట్రాలు సెకండ్ వేవ్ తో బాధ పడుతున్నాయని.. కానీ కరోనాను మనం కట్టడి చేయగలిగామని తెలిపారు.

- Advertisement -