రాష్ట్రంలో ఎవరికీ కరోనా రాలేదుః మంత్రి ఈటెల

332
etela

తెలంగాణలో ఎవరికి కరోనా రాలేదు అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజెందర్. కరోనాను ఎదుర్కొనేందుకు కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సహా వివిధ వైద్య సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వారికి ఎవరికీ కరోనా లేదని, విదేశాల నుంచి వచ్చినవాళ్లే కరోనా బాధితులయ్యారని వెల్లడించారు.కరోనా విషయంలో రాష్ట్రం తీసుకున్న చర్యలను కేంద్రం ప్రశంసించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారే కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిలో నలుగురు రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారన్నారు.