శుక్రవారం నగరంలోని కాప్రా డివిజన్ సాయిరాం నగర్ కాలనీలో బస్తి దవాఖానను రాష్ట్ర వైద్య. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్,ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డీ స్థానిక కార్పొరెటెర్ స్వర్ణ రాజుతో కలిసి ప్రారంభంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులో ఉంచేందుకు సీఎం కేసిఆర్ బస్తి దవాఖానను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 46 బస్తి దవాఖాణలను పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపటిందని ప్రతి ఒక్కరు కూడా గ్రత్తలు తీసుకోవాలిని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య. ఆరోగ్య శాఖ కార్యదర్శి యోగితరాణి,ఉప కమీషనరు శైలజ,డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, ఏఎంహెచ్‌ఓ మైత్రేయి,కాలనీ అధ్యక్షుడు అశోక్,సెక్రటరీ గజేందర్, వార్డు మెంబర్లు కొప్పుల కుమార్ శ్రీకాంత్, పవన్, మలేశ్ వంశరాజు, డాక్టర్ యామిని శ్రుతి, రీనా రాణి, అశోక్, జిఎచ్ఎమ్‌సి సిబ్బంది పాల్గొన్నారు.