హోమ్ ఐసోలేషన్‌ కిట్స్ పంపిణీ చేసిన ఈటల..

208
etela
- Advertisement -

లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320B తరఫున హోమ్ ఐసొలేషన్ కిట్స్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు చేతులమీదుగా పంపిణీ చేశారు లైన్స్ క్లబ్ ప్రతినిదులు.కరోనా వైరస్ సోకి ఇంటివద్దనే ఉంటున్న వారికి మందులు, శానిటైసర్లతో కూడిన కిట్స్ ను లైన్స్ క్లబ్ తరఫున పంపిణీ చేయనున్నారు.

ఇప్పటికే 20 లక్షల విలువ చేసే ppe కిట్స్ ను, N-95 మాస్క్ లను గాంధీ హాస్పిటల్, మిలటరీ హాస్పటిల్ లకు, వ్యక్తిగత రక్షణ కిట్స్ ను రాచకొండ కమిషనరేట్ పోలీస్ లకు అందించామని లైన్స్ క్లబ్ ప్రతినిదులు తెలిపారు.

కరోనా కష్టకాలం లో ప్రజలకు సాయం అందించేందుకు 100 మంది వాలంటీర్లు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ రోజు BRKR భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ గార్లకు కిట్స్ అందజేశారు. లైన్స్ క్లబ్ తరఫున దుర్గ వాని – డిస్ట్రిక్ట్ గవర్నర్.విద్యాసాగర్ రెడ్డి- వైస్ గవర్నర్ ,కమల్ అగర్వాల్,రేసు మల్లారెడ్డి ,అరుణ్ కుమార్, శివ పాల్గొన్నారు.

- Advertisement -