బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి..

257
Minister errabelli
- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలతో కలిసి బోనం ఎత్తుకొని వెళ్లారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన దేవునికి బోనం సమర్పించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి కాటమయ్య గుడి వరకు బోనం ఎత్తుకుని గ్రామ ప్రజలతో మమేకమైయ్యారు. అనంతరం కాటమయ్య గుడిలో ప్రజలతో కలిసి పూజలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కాటమయ్య ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. ధూప దీప నైవేద్యాలకు కూడా ప్రభుత్వం సాయంగా ఉందని తలిపారు. గ్రామ దేవతలకు పెట్టింది పేరు తెలంగాణ అన్నారు. ఊకల్ గ్రామంలో ఈ ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ కంఠ మహేశ్వర స్వామి గుడి దారి కోసం 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి మరింత సహకరిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -