కేసీఆర్, కేటీఆర్‌ల సంకల్పమే మిషన్ భగీరథ..

163
Minister errabelli
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీటిని బాటిల్స్ రూపంలో పంపిణీని జాతీయ జల్ మిషన్ కార్యదర్శి అభినందించినందుకు వారికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ: సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్‌ల సంకల్పమే మిషన్ భగీరథ పథకం. ఈ పథకాన్ని అభినందించి నందుకు జల్ మిషన్ కార్యదర్శికి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మిషన్ భగీరథ పథకాన్ని చూసే కేంద్ర ప్రభుత్వం జల్ మిషన్ పథకం ప్రారంభించింది. మిషన్ భగీరథ పథకాన్ని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాన్ని కేంద్రం అనేక సందర్భాల్లో అభినందించింది. ఫ్లోరైడ్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినందుకు అభినందనలు తెలిపింది. సాక్షాత్తు పార్లమెంటులోనే కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించింది. నీతి ఆయోగ్ సైతం మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని సిఫారసు చేసిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

కేంద్రం నుండి ఒక్క రూపాయి నిధులు రాకపోయినా ఈ పథకాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్నాం.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలి.ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసిఆర్, కేటీఆర్, నేను సైతం విజ్ఞాపనలు చేశామని.. అభినందనలతో పాటు, నిధులు కూడా ఇవ్వాలని కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -