గ్రామీణ భూ,రైతు వ్యవస్థలో గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల సమస్యలు ఎన్నో ఉన్నాయి,వాటిని క్రమ పద్ధతిలో సీఎం కేసీఆర్ తొలగించుకుంటు వచ్చారు.అయినా ఇప్పటికి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.అవి కూడా త్వరలో తొలగిపోతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఈ రోజు మాహబూబాబాద్ లోని నందన గార్డెన్‌లో నియంత్రిత సాగు విధానం-లాభసాటి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు మరియ రైతు సమితి కో ఆర్డినెటర్లతో అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోన మహమ్మారి విజృంభించి రాష్ట్రం నష్టాలను చవి చూసిన రైతుల కోసము 30 వేళా కోట్లు ఖర్చు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి అన్నారు. బయటి రాష్ట్రాల ప్రజలు మన రాష్ట్రానికి వచ్చి ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకునే పరిస్థితి నెలకొని ఉందంటే అది సీఎం కేసీఆర్ చలవే. కొద్దిపాటి ఆలస్యమైనా రైతు దగ్గర ఉన్న ప్రతి గింజను కొంటామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులు ధర్నాలు చేసే రోజులు పోయాయి. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు తగ్గించినప్పటికి రైతు బంధు కింద 7 వేళా కోట్లు,రుణమఫి కింద 12 వేళా కోట్లు ఇచ్చిన గొప్ప సీఎం కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు.
దొడ్డు వడ్లను పండించిన రైతు వాటిని అమ్మి మార్కెట్‌లో సన్న బియ్యం కొంటున్నాడు.రైతు పండించిన పంటను ఆ రైతే తినకపోతే మరి ఆ పంట ఎవరు తినాలి. అందుకే సీఎం కేసీఆర్ పంటల మార్పిడి,నియంత్రిత సాగు విధానాన్ని ఆచరణలోకి తేస్తున్నాడు,దీన్ని ప్రతి రైతు ఆచరించాలి. సీఎం కేసీఆర్ ఎన్నో పుస్తకాలు చదువుతు,రైతు శాస్త్ర వేత్తలతో చర్చలు జరిపిన పిదపనే ఇలాంటి నిర్ణయలు తీసుకున్నాడు. రైతు వేదికలకు నిధులు మంజూరు అయ్యాయి,20 లక్షలతో ఒక్కొక్క వేదికను త్వరలో నిర్మిస్తామన్నారు.
రోడ్ల మీద ధాన్యాన్ని అరబోయకుండా రైతు భూమిలోనే ఖల్లాలు కట్టుకునే విధంగా త్వరలో ప్రోత్సహకలు రైతులకు అందిస్తాం. కొత్తగా ఏర్పడిన మండలాల్లో 5 వేళా మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్ లను నిర్మాణం చేస్తున్నాం. మహాబూబాబాద్ జిల్లాలో వేయి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెద్యనాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్, సభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లాలోని వ్యవసాయశాఖ సహా, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.