ఎక్కడున్నా తెలుగువాళ్లంతా ఒక్కటేనన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమెరికా వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, రవీంద్ర కుమార్, చంటి క్రాంతి కిరణ్, గాదరి కిషోర్,ఎస్‌ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, తదితరులతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి….: సీఎం కేసీఆర్‌ఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందన్నారు. మనం ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్నతల్లిని, పుట్టిన ఊరిని మరచిపోకుండా ఆటా ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మన యాస,భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి సూచించారు.