స్మార్ట్ సిటీ ప‌నులు వేగ‌వంతంగా పూర్తి చేయాలి: మంత్రి

138
minister errabelli
- Advertisement -

ప్ర‌తి డివిజ‌న్ స‌ర్వాంగ సుంద‌రంగా క‌నిపించాలి. న‌గ‌రం అద్దంలా మెర‌వాలి. సిసి రోడ్లు, డ్రైనేజీ స‌హా అన్ని పనులు పూర్తి కావాలి. అవ‌స‌ర‌మైన సిబ్బంది నియామ‌కాల‌కు చేప‌ట్టండి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అదికారులు అభివృద్ధిలో రాజీ ప‌డొద్దు. నిర్ల‌క్ష్యంగా ఉండే అధికారుల‌ను ఉపేక్షించేది లేదు. ప‌ని చేయ‌ని కాంట్రాక్ట‌ర్ల‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి. అంటూ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు అన్నారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యం ఆర్ అండ్ బి అతిథి గృహంలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ అభివృద్ధి ప‌నులు, జ‌రుగుతున్న ప్ర‌గ‌తి మీద సంబంధిత అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఆయా ప‌థ‌కాల ప‌నితీరుని కూల‌కంశంగా చ‌ర్చించారు. అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేశ్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, బ‌ల్దియా ఎస్ ఇ విద్యాసాగ‌ర్, ఇఇ లు, ప‌బ్లిక్ హెల్త్ డిఇలు ఇత‌ర అధికారుల‌తో మంత్రి చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో ఫిబ్ర‌వ‌రి నెల నుంచి ప్ర‌తి రోజూ, ఇంటింటికీ స్వ‌చ్ఛ‌మైన మిష‌న్ భ‌గీర‌థ మంచినీటిని అందించాల‌ని ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. సిబ్బంది, ఇత‌ర స‌మ‌స్య‌లేవున్నా వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంచినీటిని అందించే విధంగా అంకిత భావంతో కృషి చేయాల‌ని మంత్రి చెప్పారు. అయితే, న‌గ‌ర పాల‌క సంస్థ‌లో ప్ర‌స్తుతం మంజూరైన పోస్టుల్లో కేవ‌లం 45శాతం మాత్ర‌మే సిబ్బంది ఉన్నార‌ని, మిగ‌తా సిబ్బందీ నియామ‌కాలు అవ‌స‌ర‌మ‌ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంట‌నే ఆయా పోస్టుల భ‌ర్తీ కి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.

ప్ర‌తి డివిజ‌న్ లో సిసి రోడ్లు, డ్రైనేజీలు పూర్తి కావాలి..
వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని మొత్తం 58 డివిజ‌న్ల‌లో సిసి రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ త‌దిత‌ర ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌కు తెలిపారు. రోడ్లు అద్దంలా ఉండాల‌ని, పారిశుద్ధ్యం ప‌టిష్టంగా నిర్వ‌ర్తించాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన డ‌బ్బుల‌ను స‌ద్వినియోగం చేయాల‌ని చెప్పారు. ప్ర‌తి నెలా ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కింద రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేస్తున్న విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు.

వ‌ర‌దల్లో చెదిరిపోయిన రోడ్ల మ‌ర‌మ్మ‌తులు చేయాలి..
ఇటీవ‌లి వ‌ర‌ద‌ల్లో తెగిపోయిన రోడ్లు, వ‌ర‌ద‌, మురుగునీటి కాలువ‌ల మ‌ర‌మ్మ‌తులకు రాష్ట్ర ప్ర‌భుత్వం 59 కోట్లు మంజూరు చేసింద‌న్నారు. ఆ నిధుల‌తో వెంట‌నే ప‌నులు ప్రారంభించి, యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌ను ఆదేశించారు. ఎవ‌రైనా కాంట్రాక్ట‌ర్లు స‌రిగా స్పందించ‌క‌పోయినా, ప‌నులు స‌కాలంలో పూర్తి చేయ‌లేక‌పోయినా వెంట‌నే అలాంటి వారి టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాల‌ని మంత్రి ఆదేశించారు.

ఫిబ్ర‌వ‌రిలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్స‌వాలు..
ఇప్ప‌టికే న‌గ‌రంలో పూర్త‌యిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్స‌వాల‌కు కూడా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌కు చెప్పారు. ఇవి ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇంకా పూర్తి కాని వాటిని వేగంగా ప్రారంభోత్స‌వాల‌కు సిద్ధం చేయాల‌ని సూచించారు. అర్హులైన‌ నిరుపేద‌లను అవ‌స‌ర‌మైతే లాట‌రీ ప‌ద్ధ‌తిలో ఎలాంటి వాద వివాదాల‌కు తావులేకుండా ఎంపిక చేయాల‌ని చెప్పారు.

స్మార్ట్ సిటీ ప‌నులు వేగ‌వంతంగా పూర్తి చేయాలి..
స్మార్ట్ సిటీ ప‌నుల‌లో వేగం పెంచి, నిర్దేశ గ‌డువులోగా వాటిని పూర్తి చేయాల‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. ముఖ్యంగా స్మార్ట్ రోడ్ల కింద ఆర్ 1, ఆర్ 2, ఆర్3, ఆర్4, ప‌నులు జ‌న‌వ‌రి చివ‌రి క‌ల్లా పూర్తి కావాల‌ని ఆదేశించారు. న‌గ‌రానికి నాలుగువైపులా ఏర్పాటు చేస్తున్న స్వాగ‌త తోర‌ణాల ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. ఆయా అభివృద్ధి ప‌నులు శీఘ్ర గ‌తిన జ‌రిగేలా కాంట్రాక్ట‌ర్ల వెంట‌ప‌డి అధికారులు ప‌నులు చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు.

- Advertisement -