దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ హోటల్ హరిత కాకతీయలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఎర్రబెల్లి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…దేవాదుల పథకం భూసేకరణ పూర్తి చేయాలని….చివరి ఎకరాకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీర అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. ఇప్పటికే 4.5లక్షల ఎకరాల్లో నీరు వచ్చింది. మిగిలిన లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మేల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, సుధీర్, నీటి పారుదల శాఖ ఉన్నతధికారులు రజత్ కుమార్, మురళీ ధర్ రావు, ఆరు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఇతర అధికారులు పాల్గొన్నారు.