ఆర్.నారాయణమూర్తిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి..

74
- Advertisement -

సమాజిక సృహా కలిసి ప్రజా సమస్యలను తన చిత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరిచే దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి సారథ్యంలో నిర్మించబడిన ‘రైతన్న’ సినిమాను అన్నివర్గాలు ఆదరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండలోని అమృత థియేటర్‌లో రైతన్న చిత్ర నిర్మాత ఆర్.నారాయణమూర్తిని కలిసి మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. రైతన్న సినిమా ద్వారా రైతుల ఇబ్బందులను వెలుగులోకి తెచ్చిన ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, కానీ మోదీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. ఇక నారాయణమూర్తి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిపే సినిమా ‘రైతన్న’ అని, ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు. అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే కొత్త రైతు చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాడిన తీరు అద్భుతమని ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు.

- Advertisement -