వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి ఎర్రబెల్లి…

93
errabelli
- Advertisement -

వనదవేతలు మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించారు మంత్రి ఎర్రబెల్లి. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు 75లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారన్నారు.

కుంభమేళా తర్వాత జరిగే అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు కల్పించినట్లు తెలిపారు.

శుక్రవారం సీఎం కేసీఆర్ మేడారానికి వస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లు, భ‌క్తుల రాక‌ను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. జాతర ఏర్పాట్లను మంత్రి 50 కిలోమీటర్ల మేర వీక్షించారు.

- Advertisement -