జనగామ జిల్లా పెద్ద పహాడ్ లో ఐకేపీ మామిడి కాయల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మామిడి రైతులు, ఐకేపీ మహిళా గ్రూప్స్ తో మాట్లాడారు ఎర్రబెల్లి.
ధాన్యం కొనుగోలు, మాస్కుల తయారీ, ఇప్పుడు మామిడి కాయల కొనుగోలు….మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారని చెప్పారు ఎర్రబెల్లి. మహిళా శక్తి అమూల్యమైనది. మహిళలు అన్ని రంగాల్లో నూ ముందున్నారు. రాణిస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రంలో 3 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో SERP ఆధ్వర్యంలో ఐకేపీ మామిడి కాయలు కొనుగోలు చేస్తుందన్నారు. మొత్తం 13 కొనుగోలు కేంద్రాలు మొదలు కానున్నాయి. అందులో ఖమ్మం, నాగర్ కర్నూలు, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల సెంటర్లు పని చేస్తున్నాయని చెప్పారు.
జనగామ 6వ కొనుగోలు కేంద్రం. మిగతా కేంద్రాలు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. మంచిర్యాల, సూర్యాపేట లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని…ఇప్పటి వరకు 300 మెట్రిక్ టన్నుల మామిడి కాయలు కొనుగోలు జరిగిందన్నారు. వీటితో పాటు పుచ్చ, అరటి, పాపాయ వంటి పండ్ల కాయలను కూడా కొనుగోలు చేస్తున్నాం అన్నారు.