బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా: మంత్రి ఎర్రబెల్లి

180
CMRF
- Advertisement -

సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలోని పలువురు లబ్ధిదారులకు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు సంబంధిత చెక్కులు అందచేశారు మంత్రి.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వారికి అపన్న హస్తంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధి ఉపయోగ పడుతుంది. ఒకవైపు ఆరోగ్యశ్రీ పథకం కింద అనేక మందికి సయంబందుతున్నా, మరోవైపు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సీఎం కేసిఆర్ నిరుపేదలకు వైద్య ఖర్చులను అందిస్తున్నారు. దీని ద్వారా అనేకమంది బాగుపడుతు న్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ బాధితులకు భరోసా కలిగిస్తున్నది. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తమకు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు రావడానికి సహకరించిన మంత్రి ఎర్రబెల్లి కి లబ్ధి దారులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -