సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేవాలయాల పునరుద్ధరణ: ఎర్రబెల్లి

265
Minister Errabelli
- Advertisement -

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయ ఈఓ, అర్చకులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామి వారిని సేవించుకున్న అనంతరం, మంత్రికి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందించి, ఆశీర్వదించారు పూజారులు.
అనంతరం దేవాలయ ప్రాంగణంలో శిల్ప కళా నైపుణ్యాలను స్వయంగా పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ నేతృత్వంలో దేవాలయాల పునరుద్ధరణ, పుర్నొద్ధరణ, పునర్వైభవం జరుగుతున్నదన్నారు. తిరుమల తరహాలోనే యాదగిరి గుట్టను 13 వందల కోట్లతో యాదాద్రిగా కేసిఆర్ అభివృద్ధి పరుస్తున్నారు. అలాగే, వేములవాడ, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి, పాలకుర్తి, వల్మీడి వంటి అనేక దేవాలయాలకు సీఎం పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి తెలిపారు.

దేవాలయాల అర్చకులకు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు అందిస్తున్నాం..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ బావుటా ఎగురవేస్తుంది. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మా ఇలవేల్పు… తరచూ ఇక్కడకు వస్తుంటాను. స్వామి వారి ఆశీర్వాదంతో రాష్ట్రం, సీఎం కేసిఆర్, వారి కుటుంబం బాగుండాలని కోరుకున్నాను అని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట ఆలయ అధికారులు, పూజారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -